బ్యాన్డ్‌ థాట్‌ వెబ్‌సైట్‌పై నిషేధం ఫాసిస్టు చర్య

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

బ్యాన్డ్‌ థాట్‌ వెబ్‌సైట్‌పై నిషేధం ఫాసిస్టు చర్య

- విరసం | 26.12.2018 12:39:06pm

ఆన్లైన్ పత్రిక బ్యాన్డ్‌ థాట్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రత్యర్థి భావాలను చూసి నిరంతరం భయపడే ఫాసిస్టులు మాత్రమే ఇలాంటి పని చేస్తారు. సరిగ్గా ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ బీజేపీ ప్రభుత్వం ఇదే చేసింది. ప్రజాస్వామ్య స్పృహ ఉన్న పాలకులు ఎవరూ భిన్నాభిప్రాయాలకు భయపడరు. పత్రికలను నిషేధించరు. కానీ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల పాలకులు తమకు భిన్నమైన రాజకీయాలను అణచివేస్తున్నారు. నిషేధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నిషేధానికి, అణచివేతకు గురైన రాజకీయాల వేదికగా బ్యాన్డ్‌ థాట్‌ నెట్‌ ఏర్పడింది. భావాలను ఎవ్వరూ నిషేధించకూడదు, అణచివేత ద్వారా భావ ప్రచారాన్ని అడ్డుకోకూడదు.. ఇలాంటి ʹనిషేధితʹ భావాల కూడలిగా ఈ అంతర్జాల వేదికను నిర్వహిస్తున్నాం.. అని బ్యాన్డ్‌ థాట్‌ నెట్‌ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భారతదేశంలోని సీపీఐ మావోయిస్టు రాజకీయ సమాచారం కూడా ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ రాజకీయార్థిక పరిణామాలు, హిందుత్వ, రాజ్యహింస, దళితులపై దాడులు వగైరా నిత్య రాజకీయాల్లోని ఎన్నో అంశాలపై ఆ పార్టీ పత్రికా ప్రకటనలు, అభిప్రాయాలు, సమాచారంతోపాటు నిషేధిత రాజకీయాలపట్ల ప్రజాస్వామిక వాదుల రచనలు, ప్రకటనలు కూడా ఇందులో అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఇప్పుడు గూగుల్‌లోకి వెళితే బ్యాన్డ్‌ థాట్‌ వెబ్‌సైట్‌ ఓపన్‌ అవుతుంది. అందులోని మిగతా అన్ని దేశాల విభాగాల్లోకి వెళ్లవచ్చు. ఒక్క సీసీఐ మావోయిస్టు విభాగాన్ని భారత కేంద్ర కమ్యూనికేషన్‌ శాఖ ఆదేశాలతో బ్లాక్‌ చేసినట్లు వస్తుంది.

నిజానికి ఈ విషయంలో మొదట భారత ప్రభుత్వం ఈ సైట్‌ నిర్వాహకులకు ఒక ఉత్తరం రాసింది. మీ సైట్‌లో నిషేధిత విషయాలు వస్తున్నాయని వివరణ కోరింది. ఈ సైట్‌ను అమెరికా నుంచి నిర్వహిస్తున్న బాధ్యులు దీనికి ఒక సమాధానం ఇచ్చారు. అదేమంటే.. అసలు భావాలను నిషేధించకూడదనే ప్రజాస్వామిక విలువ మీద మేం ఈ సైట్‌ నడుపుతున్నాం. ఆయా దేశాల్లో ప్రభుత్వాలు నిషేధించిన రాజకీయాల వేదికగా ఇది ఉండాలనుకున్నాం. ప్రభుత్వాలు నిషేధించినందు వల్లే వాటిని ప్రచారంలో పెట్టేందుకు దీన్ని నడుపుతున్నాం. ఇలా దీన్ని నిర్వహించే హక్కు మాకు ఉంది. కాబట్టి భారతదేశంలో మీరు నిషేధించిన సీపీఐ మావోయిస్టు రాజకీయ సమాచారం, రచనలు ఇందులో ఇండకూడదని మీరు అనడంలో అర్థం లేదని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత భారత కేంద్ర కమ్యూనికేషన్‌ శాఖ ఈ సైట్‌లోని సీపీఐ మావోయిస్టు విభాగాన్ని బ్లాక్‌ చేసింది.

సీపీఐ మావోయిస్టు రాజకీయాలంటే భారత కేంద్ర ప్రభుత్వం ఎంత భయపడుతోందో ఈ చర్య తెలియజేస్తోంది. పాలకుల పిరికితనానికి ఇది నిదర్శనం. పాఠకులు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ఉండే వివరాలు చదివి తమ వివేకంతో స్పందిస్తారని, దానికి చోటు ఉన్నప్పుడే ఈ సమాజం జీవించి ఉన్నట్లని పాలకులు అనుకోలేకపోయారు. ఇది సీపీఐ మావోయిస్టు రాజకీయాల మీద నిషేధమే కాదు.. దేశ పౌరుల వివేకాన్ని, చైతన్యవంతమైన రాజకీయ భాగస్వామ్యాన్ని కూడా నిషేధించినట్లు, అవమానించినట్లు.

రాజకీయాలను నిషేధించడమంటే విభిన్న రాజకీయాలు తెలుసుకునే పౌరుల స్వేచ్ఛను కూడా నిషేధించినట్లే. సీపీఐ మావోయిస్టు పార్టీకి తన రాజకీయాలను ప్రచారం చేసుకునే స్వచ్ఛ ఉంటుంది. వాటిని తెలుసుకునే స్వేచ్ఛ ఈ పౌరులందరికీ ఉంటుంది. వాటిని ప్రచారంలో పెట్టే స్వేచ్ఛ, హక్కు బ్యాన్డ్‌ థాట్‌ వెస్‌సైట్‌ నిర్వాహకులకూ ఉంటుంది. ఈ హక్కును, స్వేచ్ఛను విప్లవ రచయితల సంఘం సంపూర్ణంగా బలపరుస్తోంది. ఈ రాజకీయ స్వేచ్ఛను నిషేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తోంది.

ఈ దేశం ప్రజలు బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయాల్లాగే మావోయిస్టు రాజకీయాలు కూడా తెలుసుకునే స్వేచ్ఛ ఉంది. రాజకీయ విశ్వాసాలు కలిగి ఉండేందుకు, వాటిని ప్రచారం చేసుకునేందుకు స్వేచ్ఛ లేకపోతే ఇది దేశమూ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థా కాదు. మావోయిస్టులు చెప్పినట్లు ఇది దొంగ ప్రజాస్వామ్యమవుతుంది. తాజాగా ఈ విషయాన్ని రుజువు చేస్తూ కేంద్ర ప్రభుత్వం బ్యాన్డ్‌ థాట్‌పై నిషేధం విధించింది. దేశంలో కొన్ని రాజకీయాలకే ప్రచారం చేసుకునే హక్కు ఉండి, కొన్ని రాజకీయాలకు లేనప్పుడు దీన్ని ప్రజాస్వామ్యమని చెప్పుకొనే నైతిక అర్హత పాలకులకు లేదు. రాజకీయంగా, నైతికంగా మన పాలకులు ఆ అర్హతను ఎన్నడో కోల్పోయారు. అందులో భాగమే బ్యాన్డ్‌ థాట్‌ లింక్‌ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ చేయడం.

బీజేపీ, కాంగ్రెస్‌ దగ్గరి నుంచి ఓట్ల కోసం ఎగబడుతున్న చిన్న చితక పార్టీలన్నీ తమ రాజకీయ విధానాలను ప్రచారం చేసుకోడానికి ఎన్నో పద్ధతులు పాటిస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ అయినా తన విధానాలేమిటో ప్రజలకు చెప్పుకోకుండా ఎలా ఉంటుంది? ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలే రాజకీయ పార్టీలని, వాటివే రాజకీయాలను, వాటికే ప్రచారం చేసుకునే హక్కు ఉందనే అథమ స్థాయి నిర్వచనం మన ప్రభుత్వాలు ఇచ్చాయి. కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు ఈ దేశం పగ్గాలు ఇచ్చి, వాళ్ల ద్వారా దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకునే హక్కు అధికారంలో ఉన్న బీజేపీకి, నరేంద్రమోదీకి ఉన్నట్లే స్వావలంబన, కింది నుంచి అభివృద్ధి, దోపిడీ లేకపోవడమే నిజమైన అభివృద్ధి అని చెప్పుకోడానికి మావోయిస్టులకు కూడా అంతే హక్కు ఉంది. దాని కోసం వాళ్లు పత్రికలు నడుపుకోవచ్చు. పుస్తకాలు అచ్చేసుకోవచ్చు. సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. పాలకపార్టీల దోపిడీ విధానాలు, వాటిని కప్పిపెట్టడానికి చెబుతున్న అబద్ధాలు, అనైతిక వాదనలు, వంచనలు, మోసాలను విప్లవ రాజకీయాలు బట్టబయలు చేస్తాయి. సారాంశంలో ఈ దిక్కుమాలిన ప్రజాస్వామ్యం బూటకత్వం చాటి చెబుతాయి.. ప్రజలను ఆలోచింపచేస్తాయి.. అంతిమంగా నియంతృత్వంగా సాగుతున్న ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కూలదోసేందుకు ప్రజల్ని పురికొల్పుతాయి. పార్లమెంటరీ విధానంలో అధికారం పొందిన, పొందాలని వెంపర్లాడుతున్న అన్ని రాజకీయ పార్టీలకు ఇలాంటి విప్లవరాజకీయ ప్రచారమంటే భయం. అది నిరంతరం వాళ్లను వెంటాడుతోంది. అందుకే అధికారంలో ఉన్న పార్టీ చేసే బ్యాన్డ్‌ థాట్‌ పత్రికను బ్లాక్‌ చేయడంలాంటి ఫాసిస్టు చర్యలకు పాల్పడుతుంది. మిగతా పార్లమెంటరీ పార్టీలు వాటిపట్ల మౌనం పాటిస్తాయి.

మళ్లీ ఈ పార్టీలన్నిటికీ అధికార, అనధికార పత్రికలు ఉన్నాయి. రాజకీయ నాయకుల పెట్టుబళ్లు, వాటాలు వీటిలో ఉంటాయి. కొన్ని పార్టీలు నేరుగా పత్రికలను నడుపుతూ ఉన్నాయి. అనుబంధ టీవీ చానళ్లు ఉన్నాయి. వాటిలో తమ రాజకీయాలు ప్రచారం చేసుకుంటుంటాయి. నిస్సిగ్గుగా ప్రతి పత్రిక మరో పత్రిక మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటుంది. తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలకు ఇబ్బంది కలిగినప్పుడు భావ ప్రకటనా స్వేచ్ఛ మీద దాడి అని వీధుల్లోకి వస్తుంటాయి. నిజమైన భావ ప్రకటన అంటే నిర్వచనం తెలియని కూడా పాలకవర్గ పత్రికలు తాము ఏ పార్టీకి తోకగా ఉన్నాయో ఆ పార్టీ రాజకీయాల కోసమే అన్ని పేజీలు కేటాయిస్తుంటాయి. ఈ విషయంలో సంఘ్‌పరివార్‌ ఊడల మర్రిలా విస్తరించింది. మీడియా సంస్థలన్నిటినీ తన గొడుగు కిందికి తీసుకొని వచ్చింది. చివరికి సోషల్‌ మీడియాలో తమ బ్రాహ్మణీయ భావజాల ప్రచారానికి, ప్రగతిశీల రాజకీయాలపై దాడులు చేయడానికి సంఘ్‌ ప్రభుత్వం నేరుగా వేలాది మంది ఉద్యోగులను అనధికారికంగా ఏర్పాటు చేసుకుంది. తాము చేసే హత్యలను, అత్యాచారాలను, హింసను, మతోన్మాద భావజాలాన్ని సమర్థించుకుంటూ ప్రచారం చేసుకుంటోంది.

తాము ఇంత విషపూరిత, అనైతిక రాజకీయ ప్రచారం చేసుకుంటూ ఈ దేశ పీడిత ప్రజల విముక్తికి దారి చూపే విప్లవ రాజకీయ సమాచారం అందించే బ్యాన్డ్‌ థాట్‌ ఆన్లైన్ పత్రికను బ్లాక్‌ చేయడానికి విప్లవ రచయితల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛను, భిన్నాభిప్రాయ ప్రచారాన్ని ఒక విలువగా గౌరవించే వాళ్లందరూ బ్యాన్డ్‌ థాట్‌ పునరుద్ధరణకు కృషి చేయాలని విరసం పిలుపు ఇస్తోంది.

- పాణి
విరసం కార్యదర్శి
26. 12. 2018


No. of visitors : 299
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
  అరుణతార నవంబర్ 2019
  ఒక చిన్న అమ్మాయి రాసిన మంచి కథ " భూమి "
  నేను జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను
  సముద్రం ఇంకా బతికేవుంది
  డెన్ ఆఫ్ లైఫ్
  వాళ్ళు
  ప్రజా కళాకారుడా
  వసంతమేఘగర్జన - కార్మికోద్యమాలు
  తెలుగు రాష్ట్రాల వ్యవసాయరంగం - 50 ఏళ్ళ విప్లవోద్యమం
  సీమకవి వినూత్ననిరసన ʹʹలైఫ్‌హాలిడేʹʹ
  పడగ కింద పండు వెన్నెల!

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •