స్వేచ్చా స్వప్నం

| సాహిత్యం | వ్యాసాలు

స్వేచ్చా స్వప్నం

- శేషు కొర్లపాటి | 04.01.2019 10:55:17pm

విప్లవాలు బద్దలైన నిశబ్ధం ఈ వసంతమేఘం,దేశం పై పారుతున్న నెత్తుటి దార ఈ వసంతంమేఘం, ఈ వసంతంమేఘం ఒక స్వేచ్చా స్వప్నం.

ఎక్కడ ప్రశ్నించడం మొదలైతే
అక్కడ నిత్య నిర్భంధమే ఔతుందా ....
ఎక్కడ ఎదురించడం నేర్చుకుంటే
అక్కడ ఎన్ కౌంటర్లు మొదలౌతయా.....

మన అందరి మనస్సులో రోజూ మెదిలే ప్రశ్నలే కదా ఇవి అని నాకు ఈ కవిత్వం చదువుతుంటే అనిపించింది. ఎక్కడ ప్రశ్న మొదలైతే అక్కడ నోరు నొక్కబడుతుంది, గొంతు గెంటేయబడుతుంది , ప్రాణం పోతుంది.దేశంలో ఇప్పుడున్న పరిస్థితి ఇదే.

అందరిలా వాడు జీవించలేడు
అందరిలా వాడు ఆలోచించలేడు
వాడొక సైన్యమై
పోరాట కెరటమై
విప్లవ నావై సాగాడు

తన మిత్రుడు అమరుడైన కామ్రేడ్ వివేక్ గురించి కవి రాసుకున్న ఈ మాటలు ఇవి, అవును కదా వివేక్ అందరిలా ఆలోచించలేదు కదా, తన స్వార్ధం తన జీవితమే ముఖ్యం అనుకోలేదు, వివేక్ కూడా నేటి తరం యువకుడే,మరి వివేక్ గురించి, వివేక్ చేసిన త్యాగం గురించి నేటి తరం యువకులకు ఎంత మందికి తెలుసు,కానీ ఒక నిజం కవి గుండెల్లో ఉంటే దాన్ని సమాజం పై సందించక మానడు.కామ్రేడ్ వివేక్ గురించి సాగే ఆ కవితా ఓ గొప్ప విప్లవకారుడి మనకి పరిచయం చేస్తుంది, రాజ్యం తుపాకి తూటాకీ బలైన తన మిత్రుడిని పరిచయం చేస్తుంది.

బిడ్డలరా..! ఇవి హత్యలే… అంటూ మూసాయిపేట రైల్వే గేటు దగ్గర స్కూల్ బస్ లో చనిపోయిన పిల్లల గురించి రాస్తూ, ఇవి కచ్చితంగా కార్పోరేట్ విద్య చేసిన హత్యలే, అని చెబుతూ మీ నెత్తరు మాలో కన్నీటిని కాదు కసిని లేపుతుంది అని కార్పొరేట్ విద్యా విధానం మీద తన వైఖరిని చాలా స్పష్టంగా చెప్తాడు, మరో కవితలో నాలుగు చక్రాల మనిషి అంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సాయిబాబా గురించి,ఆయనపై మోపబడిన అక్రమ కేసులు జైలు శిక్ష గిరించి స్పందిస్తాడు. గోవుల గోల- పులుల లీల అనే కవితలో మోదీ ప్రభుత్వం అవును ముందు పెట్టుకుని పాల్పుడుతున్న పాపం ఆ గోవులకేం తెలుసు అంటూ వాటి మీద జాలి పడుతూ, ఇంట్లో ఆవు మాంసం ఉందేమో అనే అనుమానంతో అన్యాయంగా పోయిన అఖ్లాగ్ ప్రాణం గురించి తన ఆవేదన చెప్తాడు,వెలి-బలి అనే కవితలో వెలివేయబడ్డ చరిత్ర తవ్వుకుంటూ వెలుగుల్ని వెలికి తీస్తున్నాం, అని మొదలు పెట్టి,
ఈ వెలి ఎన్నాళ్లు…?
ఈ నరబలి ఇంకెన్నాళ్లు ?
అణిచివేయబడ్డ చోట
అన్యాయాలనే తవ్వుతున్నాం

అంటూ రోహిత్ వేములని వెలివేసిన మనువాదం ఎలా బలితీసుకుందో అని చెప్తూ ఇంకా ఎన్నాళ్లు ఈ దేశం లో ఇలాంటి వెలివేతలకు నరబాలి కావాలి అంటూ కవి సమాజాన్ని గట్టిగానే నిలదీసాడు. ఆలోచనలూ అంతరనివేనా…!! అనే కవిత కూడా అదే ఇలాంటి ప్రశ్నలు సమాజం మీద సాధించాడు కవి.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విష్యాలలో కవి స్పందన సమాజాన్ని నిద్రలేపేదిగా ఉంటుంది. స్వేచ్ఛ అనే కవితలో 15th ఆగస్టు ఒక సంతాప దినం అని ఆ నాడు పెరియార్ చెప్పిన విషయాన్నే కవి తనదైన శైలిలో ఇది నిజమైన స్వేచ్ఛ కాదు అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దళితుల సమస్యలు, కశ్మీర్, మతోన్మాదం, ఇలాంటి సమస్యలపై కవి స్పందించిన తీరు కూడా ఒక విప్లవమే. ఒక కళాకారుడు స్పందన చాలా సున్నితమైనది అని అంటరాని వసంతలో కామ్రేడ్ జి.కళ్యాణరావు చెప్పిన మాటలు ఈ వసంతమేఘంకి సర్రిగ్గా సరిపోతాయి.

కాపీలు కొరకు
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య (ACF)
ph:- 9989803784,9963609367,9573088009
వెల :- 60/-

No. of visitors : 322
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


ఎలా కలవాలి ?

శేషు కొర్లపాటి | 30.09.2018 11:13:18pm

వొందల కవర్ పేజీలు చేసిన నువ్వే ఓ కవర్ పేజీ అవుతావని ఎప్పుడైనా ఊహించావా స్వేచ్ఛగా ఉన్న నీ చేతులే కదా అందరికి కనిపించేది సంకెళ్లు పడ్డ నీ జీవితం ఎందరు చూడ.....
...ఇంకా చదవండి

కిటికీ పిట్ట వెలుతురు పాట‌

శేషు కొర్లపాటి | 20.01.2019 12:07:47pm

ఖైదు క‌విత్వం కిటీకి పిట్ట‌. ప్ర‌పంచ ప్ర‌సిద్దినొందిన పికాసో లాంటి చిత్ర‌కారుల‌ను, వాళ్ల సృజ‌నాత్మ‌క‌త‌ను తెలుగు నేల‌కు అత్యంత ద‌గ్గ‌ర‌గా ప‌రిచ‌యం చేసిన......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •