తొలితరం విప్లవ కథకుడు

| సంభాషణ

తొలితరం విప్లవ కథకుడు

- పాణి | 04.01.2019 10:57:55pm

చలసాని ప్రసాద్‌ ఇంట్లో రెండు మూడు సార్లు బిటి రామానుజం గార్ని చూశాను. చాలా మంది మధ్య చూడటం, పలకరించడమేగాని అంతకు మించి పరిచయం లేదు. కథలు, నవలలయితే చాలు చదవడమే వ్యసనంగా ఉన్న రోజుల్లో ఎన్‌ ఎస్‌ ప్రకాశరావు కథలు, ఎన్‌ ఎస్‌ కోసం అనే పేరుతో ఉన్న బిటి రామానుజంగారి కథలు చదివాను. అప్పుడు ఏమనిపించిందో ఇప్పుడు కచ్చితంగా చెప్పలేను. రామానుజంగారు చనిపోయారని తెలిశాక మళ్లీ ఆయన కథలు చదివాను.

గత సంవత్సరం అరుణతార కథల సంచికకు అల్లం రాజయ్యగారితో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయనతో ఫోన్లలో విప్లవ కథ వికాసం గురించి చాలా సంభాషణ సాగింది. ముఖ్యంగా తొలి తరం విప్లవ కథ గురించి. తొలి రోజుల్లో విప్లవ కథ ఎలా ఉండేది? ఎలాంటి అన్వేషణల మధ్య రూపుదిద్దుకున్నది? అంతక ముందటి తెలుగు కథతో పోల్చితే మౌలికంగా తనదైన సొంత మార్గం ఎలా వేసుకున్నది? అనే ప్రశ్నలకు మరోసారి సమాధానాలు అన్వేషించాల్సి వచ్చింది. ఇంకో పక్క తొలితరం విప్లవ కథ గురించి వినిపించే అవాకులుచవాకులు, వాటికి అప్పుట్లోనే విప్లవ విమర్శ చెప్పిన సమాధానాలు ఉన్నాయి. మొత్తంగా యాభై ఏళ్ల విప్లవ కథ ఎన్ని పరిణామాలకు గురైంది? తెలుగు కథ మీద ఏ ప్రభావాలు వేసింది? ఏ ప్రభావాలకు గురైంది? అనే ఆలోచనల్లో ఉండగా రామానుజంగారి మరణవార్త తెలిసింది. ఆయన పుస్తకం ఎన్‌ఎస్‌ కోసం 1988లో వచ్చినా.. ఆయన 1970ల తర్వాత దాదాపుగా కథలు రాయనట్టే.

పాతికేళ్ల కిందటి ఔత్సాహిక పాఠ అనుభవాన్ని పక్కన పెట్టి మళ్లీ ఒకసారి చదివితే ఆయన కథన పద్ధతి అద్భుతమనిపించింది. కొన్ని కథలు నలభై ఏళ్ల కిందటివని అనిపించలేదు. కథల్లోని వివరాలనుబట్టి అనుకోవాల్సిందే గాని చాలా తాజాగా అనిపించాయి. ఈ సంపుటిలో ఎనిమిది కథలు ఉన్నాయి. దేనికదే విభిన్నమైన వస్తువులు తీసుకొని రాశారు. పూర్తిగా వేర్వేరు సామాజిక పాత్రల వైపు నుంచి కథలు నడిచాయి. ఇతివృత్తాలు, పాత్రలు, వాటి స్వభావాల్లో ఇంత వైవిధ్యం అపురూపమనిపిస్తుంది.

ప్రభుత్వ నిషేధానికి గురైన తొలి విప్లవ కథా సంకలనం ʹఇప్పుడు వీస్తున్న గాలిʹలో బీటీ కథ ʹనిటలాగ్ని రగిలిందిʹ ఉంది. దీనికి కొడవటిగంటి కుటుంబరావు సంపాదకత్వం వహించారు. శ్రీకాకుళ సాయుధ పోరాటం వెలుగులో విప్లవ కథకు భూషణం ప్రాణం పోశారు. ఆయన కథలు ఆదివాసీ నేపథ్యంలో ఉంటాయి. విశాఖపట్నంలోంచి ఎన్నెస్‌, బీటీ ఆ విప్లవ స్ఫూర్తితో అనేక జీవిత నేపథ్యాలను, వాటి నుంచి వచ్చిన పాత్రలను కథల్లోకి తెచ్చారు. ఆ రకంగా విప్లవ కథకు సమగ్ర వ్యక్తిత్వం సంతరించిపెట్టే ప్రయత్నం చేశారు.

మామూలుగా విప్లవ కథల మీద చౌకబారు విమర్శలు చాలా ఉండేవి. విప్లవం తప్ప మరేమీ ఉండదని, విప్లవ ముగింపులతో అన్నీ ముగిసిపోతాయని అనేవాళ్లు. ఇలాంటి కథలు ఔత్సహిక కథకులు అప్పట్లో కొన్ని రాశారు. కానీ విప్లవ కథను తీర్చిదిద్దిన కథకులు మానవ జీవితం మొత్తాన్ని వీలైనంత చిత్రించాలనే దృష్టితో వ్యవహరించారు. విప్లవమనేది కథా వస్తువులోనో, పాత్రల్లోనో, ముగింపులోనో ఉండదు. దృక్పథం వీటిల్లో మాత్రమే ప్రతిబింబించదు. విప్లవమంటే సమూల మార్పు అనే భావన తొలిసారి బలంగా వచ్చిన కాలం అది. కాబట్టి సాహిత్యంలో ముఖ్యంగా కథల్లో ఇది అనేక స్థాయిల్లో వ్యక్తమైంది. జీవితంలోని వైవిధ్యాన్నంతా గుర్తించడం వల్ల వస్తువు, పాత్రలు, చైతన్య క్రమం, కథా నిర్వహణ అన్నిట్లో ఇది కనిపిస్తుంది. సాహిత్యం మానవ అనుభవానికి సంబంధించిందనే ఎరుక ఎంత ఉంటే అంతగా ఆ రచన విప్లవాత్మక పరిణామాన్ని చిత్రిస్తుంది, దానికి దోహదపడుతుంది. అయితే ఇప్పటికీ విప్లవోద్యమ ఇతివృత్తం ఉన్నదే విప్లవ కథ అని అమాయక విమర్శకులు అనుకుంటూ ఉంటారు. 1970లలో కూడా సాహిత్యోద్యమం విప్లవాన్ని ఇంత సంకుచితంగా చూడలేదు. దేనికంటే విప్లవోద్యమం అలా అనుకోలేదు కాబట్టి. అందువల్ల విప్లవ కథ ఇరుకు చట్రంలోకి జారిపోలేదు. విప్లవ సమగ్ర దృక్పథం ఆ కథల వస్తువుకో, ముగింపుకో పరిమితం కాలేదు. కథా రచయితలు ఇంత విశాలమైన, శాస్త్రీయమైన అవగాహనతో సృజన రంగంలో వ్యవహరించారు. విప్లవ కథకు బలమైన పునాది వేశారు.

ఈ కృషి చేసిన వాళ్లలో బీటీ పేరు తప్పక చెప్పుకోవాలి. కథా నిర్మాణంలో ఆ తరం వాళ్లు పాటించిన మెలకువలకు, విప్లవ కథా దృక్పథానికి తొలి రోజుల్లో అద్భుతమైన ఉదాహరణ బీటీ. సకల జీవన ఇతివృత్తాలు విప్లవ కథలో భాగం కావాలనే ఎరుకతో బీటీ కథలు రాశారనే నమ్మకం ఈ సంపుటి కలిగిస్తుంది. ఆసక్తి కొద్దీ ఎన్‌ఎస్‌ కథలు కూడా మరోసారి తిప్పేస్తే పైన చెప్పిన రెంటిలో ఇద్దరికీ చాలా పోలికలు కనిపించాయి. కథ నడిచే తీరు, ముగింపు చాలా పద్ధతిగా ఇద్దరి కథల్లో ఉంటాయి. చాలా పరిణత కంఠస్వరంతో ఇద్దరూ రాశారు. బహుశా వయసు రీత్యా బీటీ, ఎన్నెస్‌ అప్పటికి నవయువకులై ఉంటారు. కానీ కథల్లో కనిపించే జీవన విస్తృతి అబ్బురమనిపిస్తుంది. విప్లవ దృక్పథం పట్ల అవగాహన, మానవ జీవితంపట్ల ఆర్తి లేకుంటే ఈ కథలు రాయడం అసాధ్యం.

బీటీ కథా రచనలోకి వచ్చేనాటికి జాజ్వల్యమానమైన శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటం దెబ్బతినిపోతోంది. కానీ ఆ ఉత్తేజం, చైతన్యం ఆనాటి సకల జీవన రంగాలనే తేజోవంతం చేస్తున్నాయి. తిరిగి పోరాటాలకు సన్నాహాలు ఆరంభమయ్యాయి. ముఖ్యంగా ఇలాంటి ఉత్తరాంధ్ర సామాజిక, ఉద్యమ వాతావరణంలో బీటీ ఈ కథలు రాయడం ఆరంభించారు. విశాఖ కార్మిక జీవితం ప్రతిబింబించే కథ ʹఘాటెక్కే గంధక ధూమంʹ. సంపుటిలో ఇది పెద్ద కథ. ఇందులో బీటీ ఎక్కడా పాత్రల ఆదర్శీకరణకు పాల్పడలేదు. ఆ పాత్రల జీవిత నేపథ్యంలోంచి, వాళ్ల మనస్తత్వంలోంచి చాలా సహజంగా ప్రవర్తిస్తాయి. సామాజిక శక్తుల సంఘర్షణ మానవ జీవితంలో, చైతన్యక్రమంలో ఎలా వ్యక్తమవుతుందో ఈ కథలో చూడవచ్చు. ఆ చైతన్యక్రమంలోని ఎత్తుపల్లాలను కూడా బిటి ఎలాంటి సంకోచాలకు తావు లేకుండా స్థల కాల ప్రమేయాలతో చిత్రిస్తూ విప్లవ ఆశావాద వైఖరితో కథ ముగిస్తారు. భద్రత కథ చాలా చిన్నదే కాని బ్యాంకింగ్‌ వ్యవస్థ స్వభావం కళ్లకు కడుతుంది. అరుణ ధైర్యంగా అనేక ఆటుపోట్ల మధ్య ప్రయాణిస్తుంది. ఎలాంటి పరిస్థితిలో కూడా తన వివేకాన్ని, చైతన్యాన్ని కోల్పోని మహిళ.

ఒక దశాబ్దంలో ఎనిమిది కథలే రాశారు. విప్లవ కథ పరిణామ చరిత్రలో నిలిచిపోయేలా రాశారు. ఆ తర్వాత విరసంలో లేకపోవచ్చు. కానీ ఈయన కథలు విప్లవ కథా చరిత్రలో విడదీయలేని భాగం. ఈ తరం కథకులు చదవాల్సిన కథలివి.

No. of visitors : 314
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


వెంకయ్యనాయుడికి సిగ్గనిపించదా?

పాణి | 04.05.2017 10:53:32am

హింస మీద, ఆయుధం మీద, అంతకు మించి భయం మీద బతికే ఈ పాలవర్గాల దుర్మార్గాన్ని గర్భీకరించుకున్న ప్రజాస్వామ్యమిది. అందుకే మావోయిస్టులు ఈ ప్రజాస్వామ్యాన్ని కూల......
...ఇంకా చదవండి

ఈ తీసివేత‌లు... రాజ్యం హింసామయ నేరవృత్తిలో భాగం కాదా?

పాణి | 16.08.2016 12:59:12am

నేరం, హింస సొంత ఆస్తిలోంచి పుట్టి సకల వికృత, జుగుప్సాకరమైన రూపాలను ధరిస్తున్నాయి. ఇలాంటి వ్యవస్థను కాపాడటమే రాజనీతి. ఆధునిక రాజనీతిలో ఎన్ని సుద్దులైనా.........
...ఇంకా చదవండి

ఆజాదీ క‌శ్మీర్ : చ‌ల్లార‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌

పాణి | 16.07.2016 11:04:09am

కాశ్మీరంటే ఉగ్రవాదమనే ప్రభుత్వ గొంతుకు భిన్నంగా మాట్లాడి తమ దేశభక్తిని తామే అగ్ని పరీక్షకు పెట్టుకోడానికి సిద్ధపడేవాళ్లెందరు? కాశ్మీరీల అంతరాంతరాల్లో........
...ఇంకా చదవండి

రైతు - నీళ్లు

పెన్నేరు | 16.08.2016 01:10:03pm

రైతు వానలు కురిస్తే ఇట్లాంటి సమస్యలు ఎందుకు ఉంటాయి? అనుకుంటున్నాడు. ళ్లు పుష్కలంగా అందించే డ్యాంల కింద వ్యవసాయం చేసే రైతు ఇట్లా అనుకోగలడా? డెల్టా ప్రాంతం......
...ఇంకా చదవండి

వివేక్ స్మృతిలో...

పెన్నేరు | 17.09.2016 09:54:49am

వివేక్ అమరత్వం తర్వాత విప్లవంలోకి యువతరం వెళ్లడం, ప్రాణత్యాగం చేయడం గురించి చాలా చర్చ జరిగింది. ఇది చాలా కొత్త విషయం అన్నట్లు కొందరు మాట్లాడారు.......
...ఇంకా చదవండి

భావాలను చర్చించాలి, ఘర్షణ పడాలి...బెదిరింపులు, బ్లాక్‌ మెయిళ్లు ఎవరు చేసినా ఫాసిజమే

పాణి | 22.09.2017 01:18:31pm

ఐలయ్యగారు ఏం చేశారు? ఈ దేశ చరిత్రలో వివిధ కులాలు పోషించిన సామాజిక సాంస్కృతిక, రాజకీయార్థిక పాత్ర గురించి అధ్యయనం చేస్తున్నారు. ఇది అత్యవసరమైన సామాజిక పరి......
...ఇంకా చదవండి

జీవిత కవిత్వం

పాణి | 04.06.2017 12:38:44pm

విప్లవ కవిత్వాన్ని దాని జీవశక్తి అయిన విప్లవోద్యమ ఆవరణలో మొత్తంగా చూడాలి. ఒక దశలో విప్లవ కవిత్వం ఇలా ఉన్నది, మరో దశలో ఇలా ఉన్నది.. అనే అకడమిక్‌ పద్ధతులకు వ...
...ఇంకా చదవండి

కులం గురించి మాట్లాడటం రాజద్రోహమా?

పాణి | 07.10.2017 11:08:49am

ఈ సమస్య ఐలయ్యది మాత్రమే కాదు. మన సమాజంలోని ప్రజాస్వామిక ఆలోచనా సంప్రదాయాలకు, భిన్నాభిప్రాయ ప్రకటనకు సంబంధించిన సమస్య. ఇంత కాలం కశ్మీర్‌ దేశస్థుల స్వేచ్ఛ గు...
...ఇంకా చదవండి

మానవ హననంగా మారిన రాజ్యహింస

పాణి | 02.11.2016 08:47:26am

ప్రజలు ఐక్యం కాకుండా, అన్ని సామాజిక సముదాయాల ఆకాంక్షలు ఉమ్మడి పోరాట క్షేత్రానికి చేరుకొని బలపడకుండా అనేక అవాంతరాలు కల్పించడమే ఈ హత్యాకాండ లక్ష్యం.......
...ఇంకా చదవండి

నాగపూర్‌ వర్సెస్‌ దండకారణ్యం

పాణి | 17.11.2017 11:35:51pm

దండకారణ్య రాజకీయ విశ్వాసాలంటే న్యాయవ్యవస్థకు ఎంత భయమో సాయిబాబ కేసులో రుజువైంది. నిజానికి ఆయన మీద ఆపాదించిన ఒక్క ఆరోపణను కూడా కోర్టు నిరూపించలేకపోయిందిగాని, ...
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  సృజనాత్మక ధిక్కారం
  హింసలోనే పరిష్కారం వెతికిన రాజ్యం
  ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
  హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
  వాళ్ళు
  ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
  గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
  దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
  జై శ్రీరామ్!
  రమాకాంత్‌ వాళ్లమ్మ
  హిందూ రాజ్యం దిశగా
  అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •