అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్

| సాహిత్యం | క‌విత్వం

అయోధ్యకి మళ్ళీ రెక్కలొచ్చినయ్

- గిరిప్రసాద్ చెలమల్లు | 04.01.2019 11:16:50pm

అయోధ్యకి
మళ్ళీ రెక్కలొచ్చినయ్
శబరిమలైకి
పురుడు పోసిండ్రు
రాముడు యాదికొచ్చిండు
అయ్యప్పకు అంటు తగిలింది
ఓట్లపండుగ
వస్తుందనగానే
ఎజెండాలో జెండా నిటారుగా
మసీదు
మందిరం కొట్లాట
కోర్టులు
విశ్వాసాల పరీక్షలో బిజీ
ఆవు వస్తది
పాలిస్తదో
పాలననిస్తదో
బొట్టు
కట్టు ముట్టు మడి
జ్ఞానమో అజ్ఞానమో
శీలం కొలమానమో
ఐక్యతో అనైక్యతో
వేరుచేసి
వేరుపురుగులా
సమాజాన్ని చెరిచే
కార్యాచరణ
అంగుళం కూడా తేడాలేని
పోకడ
ప్రశ్నించే గొంతులు
ఇనుపఊచల వెనుక
సూరీడు పడమటికొండల్లో
కుంగుతాడంతే
మళ్ళీ తూర్పున పదునెక్కి
ఉదయిస్తాడు
హక్కుల ఉల్లంఘన
యధేచ్చగా
కూంబింగ్ మార్చ్
పొల్లుపోని అదే అంశ
ప్రజాస్వామ్య మరణం
మతరాజ్య స్థిరీకరణ
లౌకికం
అలౌకికం గ్రంథ పుటల్లో
స్మృతి రాజ్యమేలే

No. of visitors : 269
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


పంజగుట్ట చూపుడు వేలు

గిరిప్రసాద్ చెలమల్లు | 16.04.2019 09:40:09am

చూపుడు వేలు దొరనెచ్చరిస్తుందేమో చేతిలో పుస్తకం చదవమన్నాడేమో లచ్చ పుస్తకాలు చదివినాయన్ని ...
...ఇంకా చదవండి

పెట్టుబడి

గిరిప్రసాద్ చెలమల్లు | 17.03.2019 09:32:30am

ఒక పెట్టుబడి రోగాన్ని సృష్టిస్తే ఒక పెట్టుబడి రోగానికి మందుబిళ్ళ తయారుచేస్తుంది ...
...ఇంకా చదవండి

పొద్దు

గిరిప్రసాద్ చెలమల్లు | 18.02.2019 09:42:17pm

గుండె గాడి తప్పుతుంటే మనిషిని ఆవేశం ఆవహిస్తుంటే బిగుస్తున్న పిడికిలిని పొడుస్తున్న పొద్దు పిలుస్తుంటే దోపిడీపై సమరశంఖం పూరింపు అదీ డెసిబుల్స్ కి అందదు ......
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  ధిక్కార ప్రతీక గిరీష్‌ కర్నాడ్‌
  అరుణతార జూన్ 2019
  మహాభారతం - చారిత్రక వాస్తవాలు
  జల వనరుల సాధనకు స్ఫూర్తి
  వెన్నెల సెంట్రీలో మోదుగు పూల వాన‌
  నల్లని పద్యం
  పేకమేడలు
  Democratized Poetry
  ప్రశ్నించేతత్త్వం - బ్లాక్ వాయిస్
  ఇప్పుడు గుండె దిటువుతో నిలబడేవాళ్లు కావాలి
  Women Martyrs of The Indian Revolution ( Naxalbari To 2010 ) - Part 2
  ఆచ‌ర‌ణే గీటురాయి

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •