మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు

| సాహిత్యం | స‌మీక్ష‌లు

మానవ సంబంధాలను ఎత్తిపట్టిన కథలు

- హిత | 05.01.2019 02:56:28pm


ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినపుడు కథల సంపుటిని పలమనేరు బాలాజీ ఇటీవల వెలువరించారు. ఇటీవల తెలుగు సాహిత్యంలో వెలువడిన అత్యుత్తమ కథల సంపుటుల్లో ఇదొకటి. ఈ సంపుటిలో మొత్తం పదకొండు కథలు ఉన్నాయి. సమాజంలోని వైరుద్యాలను అత్యుత్తమంగా చిత్రించిన కథలు ఇవి. సమాజంలోని భిన్న వైరుద్యాలను చిత్రించే కథలు విప్లవ కథలు అయితే ఈ సంపుటిలోని కథలన్నీ విప్లవ కథలే. వైవిధ్యమైన కథావస్తువులను ఎన్నుకొని మానవ సంబంధాలను చిత్రించాడు. వైరుధ్యాలను ఎత్తిచూపే ప్రశ్నలు వేసిన రచయిత పరిష్కారాలను మాత్రం పాఠకులకే వదిలేసాడు. అలోచింపజేసే కథలు ఇవి. మనుషులుగా మన స్థానం ఏంటో చేప్పే కథలు ఇవి. సమాజం పట్ల నీ బాధ్యతను గుర్తు చేసే కథలు ఇవి. పరిష్కార మార్గాలు వెతకమని ఉద్భోదించే కథలు. సహజ కథకుడైన పలమనేరు బాలాజీ, జీవితాన్ని ప్రేమించే వ్యక్తి. మానవ సంబంధాల కోసం పరితపించే వ్యక్తి. ఒక స్నేహం తెగిపోతే విలవిలలాడే వ్యక్తి. భిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులను కూడా గౌరవించగలిగే వ్యక్తి. భిన్నాభిప్రాయాలను గౌరవించే వ్యక్తి. అందువలననే ఈ కథలలో మానవసంబంధాల కోరకు అతను పడే ఆర్తి కనిపిస్తుంది. ఎవరి మెప్పు కోసమో రాసిన కథలు కావు. తన గొప్పతనాన్ని చెప్పుకోవడానికి రాసిన కథలు కావు ఇవి. మనిషిగా తన బాధ్యత తెలిసిన వాడిగా, తన పనిగా భావించి రాసిన కథలు. ప్రతి కథలో కూడా ఒక ఆర్తి కనపడుతుంది. మానవ జీవితంలోని సంక్లిష్టతలను , సంక్షోభాలను చిత్రించిన కథలు. వాస్తవ దృక్పథం గల కథలు ఇవి. సునిశిత పరిశీలనతో రాసిన కథలు. మానవ జీవితంలోని సమస్త విషయాలు సరుకులుగా మారాక మనిషి ఎలా ఉన్నాడో ఎక్స్‌ రే తీసి చూపించిన కథలు ఇవి. ఆలోచనలను రేకెత్తించే కథలు. సామాజిక వాస్తవాన్ని చిత్రించడమే మంచి సాహిత్యమయితే ఈ సంపుటి ఆ మంచి సాహిత్య పరిధిలోకే వస్తుంది. మొహమాటాలు లేకుండా వాస్తవాన్ని విప్పిచెప్పిన కథలు ఇవి.

కొన్ని ప్రేమలు - కాసిన్ని దు:ఖాలు కథ కుటుంబ వ్యవస్థలో బందీయైన స్త్రీ ఆలోచనలకు, సంవేదనలకు రూపం ఇచ్చిన కథ.

పెద్దోళ్ళు కథ గ్రామీణ సమాజంలో నెలకొన్న అసమానతలను, స్వార్థంను ఎత్తిచూపే కథ. సమస్యల పరిష్కారంలో గ్రామాలలో ఎదురయ్యే అడ్డంకులు వివరించే కథ.

మీరేమంటారు కథ సాంప్రదాయబద్దంగా భర్త అంత్యక్రియలను చేయలేని నిస్సహాయస్థితిలో ఒక స్త్రీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నదో తెలిపే కథ.

ఏమైందో, ఏమిటో ? కథ మనుషుల మధ్య ఉండవలసిన సంబంధాలను ఎత్తిచూపే కథ

సూపర్‌ మార్కెట్‌ కథ మానవ సంబంధాలన్నీ మార్కెటు సంబంధాలుగా మారిన తీరును వివరించే కథ

ఇంట్లోపలికి వెళ్ళేముందు కథ అస్తిత్వ సంక్షోభాన్ని విప్పి చెప్పిన కథ.

వీళ్ళెవరో మీకు తెలుసా కథ ఇబ్బందుల్లో ఉన్న వ్యకుల పట్ల సమాజం ప్రవర్తించాల్సిన తీరును విశ్లేసించే కథ.

ఖాళీ కప్పులు కథ భార్యాభర్తల మధ్య ఉండవలసిన సంబంధాలను గుర్తు చేసే కథ

ఏనుగుల్ని చూసిన వాడు కథ పాలక వర్గాల స్వభావాన్ని విప్పిచెప్పే కథ. అడవిలో నివసించే ఆదివాసి పోడు చేయకూడదు. అడవిలోకి వెళ్లి చెట్లు కొట్టకూడదు. కర్రతో గుడిసె వేసుకోకూడదు. వేట ఆడకూడదు. కాని అడవిలోని చెట్లను రక్షించాలి, జజంతువులను రక్షించాలి. ఇదెలా ఉందంటే నీటిలోని చేప ఈదకూడదు, నీటిలో ఉండకూడదు, ఒడ్డునే ఉండాలి. మనుషుల ప్రాణం కంటే ఏనుగుల ప్రాణాలకు విలువనిచ్చే పాలక వర్గాల స్వభావాన్ని విప్పి చెప్పే కథ.

ఏమవుతుంది కథ మహిళా ఉద్యోగుల జీవితాల్లో ఉండే రకరకాల ఒత్తిళ్ళను విడమర్చి చెప్పిన కథ.

మంచి రోజులు కథ నోట్లను రద్దు చేసిన కాలంలో సామాన్య మానవుడు పడిన అగచాట్లను తెలిపే కథ

ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు కథ ఇంటికి ముందే చేరిన వ్యక్తి తన కుటుంబ మనుషుల కోసం చేసే నిరీక్షణను విశ్లేషిస్తుంది.

వస్తు వైవిధ్యం కలిగిన ఈ సంపుటిలోని కథలు సమకాలీన సమాజాన్ని చిత్రించాయని చెప్పవచ్చు.

(ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు కథలు - రచయిత పలమనేరు బాలాజీ- వెల.వంద రూపాయలు- అన్ని పుస్తకషాపులలో లభ్యమగును)

No. of visitors : 340
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


0 results

ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం

భారత కార్మికవర్గం కర్తవ్యం ఏమిటి? దోపిడీదారి వ్యవస్థ నుండి విముక్తికై సాగే జాతీయ విప్లవపోరాటానికి నాయకత్వం వహించవలసిన చారిత్రిక బాధ్యత కార్మికవర్గంపై..

 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
 • చారిత్రాత్మక మే 25, 1967
 • భారతదేశంపై వసంత మేఘ గర్జన
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్‌
  భారత విప్లవోద్యమంలో చారుమజుందార్ శతజయంతి సదస్సు
  విరసం నాయకుడు జగన్‌పై అక్రమంగా పెట్టిన ఉపా కేసు ఎత్తివేయాలి
  అరుణతార అక్టోబర్ 2019
  మనమూ తేల్చుకోవాల్సిందే
  ఆత్మీయ కలయిక
  కరవాలం చెప్పిన రహస్యం
  కాశ్మీరు మనది!
  మంచి కథ ఎప్పుడూ పాఠకుల ఆలోచనలకు పదును పెడుతుంది
  అక్షర సాహసులకు చైతన్య స్ఫూర్తి విరసం
  విరసం తో నా అనుబంధం - అనుభవం
  కులం - విప్లవోద్యమ అవగాహన, ఆచరణ - 2

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •