యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి

| ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు

యువ విప్లవ కవి, విరసం సభ్యుడు కా. సంతోష్‌ అక్రమ నిర్బంధాన్ని ఖండించండి

- విరసం | 05.01.2019 02:58:53pm

విరసం సభ్యుడు కామ్రేడ్‌ సంతోష్‌ను హైదరాబాదులోని మలక్‌పేట ప్రాంతంలో నిన్న(డిసెంబర్‌4) సాయంకాలం పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. గత రెండు రోజుల కింద కార్మిక, రైతాంగ కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసగాన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న తర్వాత బైటికి వెళ్లిన సంతోష్‌ను అరెస్టు చేశారు. విప్లవ విద్యార్థి ఉద్యమంలో పీడీఎస్‌యూ నాయకుడిగా సంతోష్‌ చాలా కాలంగా పని చేస్తున్నాడు. కవిత్వమంటే చాలా ఇష్టం. అనేక పనుల మధ్యనే కవిత్వం రాస్తూ విప్లవ రచయితల సంఘంలోకి వచ్చాడు. ఇటీవలే వసంత మేఘం పేరుతో కవితా సంపుటి అచ్చేశాడు. విరసంలో ఈ తరం కవులకు, కవిత్వానికి కా. సంతోష్‌ ఒక ఉదాహరణ. అనేక రాజకీయ సామాజిక విశ్లేషణ వ్యాసాలు కూడా రాశాడు.

తెలంగాణలో ప్రజా ఆకాంక్షలను కాలరాస్తున్న కేసీఆర్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక మరింత పేట్రేగిపోతున్నాడు. నిర్బంధమే అధికార విధానంగా సాగిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన విద్యార్థి యువజనులు ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. కా. సంతోష్‌ అప్పుడూ, ఇప్పుడూ విద్యార్థి ఉద్యమంలో భాగంగా పాలక విధానాలకు, వివక్షలకు, దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. రాస్తున్నాడు. అందుకే ఆయన్ను అక్రమంగా అరెస్టు చేశారు.

కవులు, రచయితలు, మేధావులపై దేశవ్యాప్తంగా పెరిగిపోయిన నిర్బంధంలో, ప్రజా సంఘాలపై అమలవుతున్న దారుణ అణచివేతలో భాగమే కా. సంతోష్‌ అరెస్టు. తనను విడుదల చేయాలని సాహిత్యకారులు, బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విరసం విజ్ఞప్తి చేస్తోంది.

పాణి
విరసం కార్యదర్శి





No. of visitors : 462
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర

కార్మికవర్గానికి మార్క్స్, ఏంగెల్స్ లు చేసిన సేవను నాలుగు మాటల్లో చెప్పాలంటే ఈ విధంగా చెప్పవచ్చు : కార్మికవర్గం తన్ను తాను తెలుసుకొని, తన శక్తిని చైతన్యవ...

  • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
  • Open letter to Krishna Bandyopadhyay
  • Naxalbari Politics: A Feminist Narrative
  • చారిత్రాత్మక మే 25, 1967
      వీడియోలు  
    లేటెస్ట్ పోస్టులు...
    ఆ చావు ఎవరికీ రావొద్దు - యురేనియం ఎక్కడా తవ్వొద్దు.
    హిందుత్వ శక్తులు చేస్తున్న బలవంతపు మత మార్పిడులకు బలైన ఒక ఆదివాసీ యువకుడి కథ
    వాళ్ళు
    ఇంగ్లీషు వద్దనడం లేదు, తెలుగు మాధ్యమం ఉంచండి
    గుండెను స్పృశిస్తూ జరిపిన ఒంటరి సంభాషణ "నా గదిలో ఓ పిచ్చుక"
    దేశంలో ప్రశాంతత నెలకొనివుంది-జైళ్ళూ నోళ్ళు తెరుచుకొనే వున్నాయి - తస్మాత్ జాగ్రత్త
    జై శ్రీరామ్!
    రమాకాంత్‌ వాళ్లమ్మ
    హిందూ రాజ్యం దిశగా
    అయోధ్య తీర్పు మీద మాట్లాడబోతే అరెస్టు చేస్తారా?
    ఇది హిందూ న్యాయస్థానం ప్రకటించిన ఫాసిస్టు తీర్పు.
    అరుణతార నవంబర్ 2019

    గత సంచికలు...


    Email Subscription

    Related Links

    www.sanhati.com
    www.bannedthought.net/India
    www.indiaresists.com
    www.signalfire.org
    www.icspwindia.wordpress.com
    www.kractivist.org
    www.magazine.saarangabooks.com
    www.arugu.in
    www.sovietbooksintelugu.blogspot.in
  •