దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం

| సంపాద‌కీయం

దేశీ సాహిత్య, సామాజిక చరిత్ర : మార్క్సిజం

- విరసం | 20.01.2019 11:28:53am

తెలుగు సాహిత్యంలో మార్గ, దేశీ సంప్రదాయాలున్నాయని అందరికీ తెలిసిందే. బ్రాహ్మణీయ సాహిత్యానికి, సంస్కృత అనువాద సాహిత్యానికి భిన్నమైనది దేశీ సాహిత్యం. నన్నయ్యకు ప్రత్యామ్నాయంగా నన్నెచోడుడు, పాలకుర్తి సోమనాథుడు మొదలైన వాళ్లు దేశీ, జాను తెనుగు సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. తమది దేశీ సాహిత్యమని వాళ్లే ప్రకటించుకున్నారు. ఇది అవైదికం, ఆస్థానేతరం. లిఖిత సాహిత్యానికి ముందు నుంచే ఉన్న జానపద, మౌఖిక ప్రజా సంప్రదాయమంతా దేశీ సాహిత్యంలో భాగం.

మార్గ సంప్రదాయమంతా సంస్కృత భాషలో, పండితుల తెలుగులో ఉన్నందు వల్లనే దేశీ సాహిత్యకారులు దాన్ని తిరస్కరించలేదు. సంస్కృతం కేవలం భాషా మాధ్యమానికే పరిమితం కాదు. సనాతన ధర్మానికి, కులవ్యవస్థకు, బ్రాహ్మణ్య భావజాలానికి, సంస్కృతికి అది ప్రాతినిధ్యం వహించింది. మరీ ముఖ్యంగా ఒకానొక కాలంలోని ఉత్పత్తి విధానానికి సంబంధించింది. అంటే నేరుగా ఒక వర్గాన్ని సూచించేది. పాలక పక్షం వైపు నిలబడి శ్రమ దోపిడీని, అంటరానితనాన్ని సమర్థించే నీతి, కట్టుబాట్లు, భావజాలం, ఆలోచనారీతులు సంస్కృతంలో చెలామణి అయ్యాయి. సమాజంలో అవి పదే పదే పునర్జీవం పొందడానికి సంస్కృత భాష, సాహిత్యం, దాన్నుంచి అనువదించుకున్న తెలుగు కావ్యాలు కారణమయ్యాయి.

ఇలాంటి శిష్ట సాహిత్యంపై దండయాత్రగా దేశీ లిఖిత సంప్రదాయం ఆరంభమైంది. భాష, ఛందస్సు, వ్యక్తీకరణలతో సహా దేశీ కవులు విప్లవాత్మక సాంఘిక దృక్పథాన్ని తీసుకొని వచ్చారు. పాల్కురు సోమనాథుడు ʹమాదిగయె తొల్లి మహియెల్ల..ʹ అని పండితారాధ్య చరిత్రలో అన్నాడు. శిష్ట సాహిత్యానికి ప్రత్యామ్నాయమైన సామాజిక, ఉత్పత్తిదాయకమైన వైఖరిని ఇది సూచిస్తుంది.

ఈ కారణం వల్లే దేశీ సాహిత్యాన్ని, కళలను ఆధునిక, ప్రగతిశీల, విప్లవ సాహిత్యకారులందరూ సొంతం చేసుకున్నారు. ఆయా కాలాల్లో దేశీ ఒరవడికి చెందిన రచయితల ప్రగతిశీల పాత్రను, వాళ్ల సాహిత్యంలోని ప్రజా జీవితాన్ని విశ్లేషిస్తూ వచ్చారు. కేవలం గ్రంథ రూపంలోని సాహిత్యాన్నే గాక మౌఖిక, జానపద, ప్రజా సాహిత్యాన్నంతా ఈ వొరవడిలో గుర్తించారు. ఈ వారసత్వాన్ని అత్యున్నత రూపంలో, వర్గపోరాట దృష్టితో విప్లవ, ప్రగతిశీల సాహిత్య సాంస్కృతికోద్యమం కొనసాగిస్తున్నది.

ఈ స్థూల నేపథ్యంలో విప్లవ రచయితల సంఘం మరోసారి దేశీ సాహిత్యాన్ని ఈ పాఠశాలలో విశ్లేషించబోతోంది. అయితే దేశీ సాహిత్య విశేషాలు, ప్రత్యేకతలు వివరించుకుంటే సరిపోదు. దేశీ సాహిత్య చరిత్రను నిర్మించాలి. సాహిత్య చరిత్రను సామాజిక చరిత్రలాగే శాస్త్రీయ సామాజిక సిద్ధాంత పద్ధతిలో రూపొందించాలి. లేకపోతే అకడమిక్‌ పద్ధతిలో వివరాలు పోగేసి వర్ణించి సరిపెట్టుకున్నట్లవుతుంది. దీన్ని అధిగమించాలంటే ముందు దేశీ సామాజిక చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడే దళిత, ప్రగతిశీల సామాజిక పరిశోధన, విప్లవోద్యమ నిర్మాణ రంగాల్లో దేశీ చరిత్ర గురించి జరుగుతున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసికెళ్లడం సాధ్యమవుతుంది.

సామాజిక చరిత్ర పరిశోధన ఆధునిక యుగంలోనే మొదలైంది. అంతక ముందు మనకు సాహిత్యం, తాత్విక, భావజాల చర్చలు మాత్రమే ఉన్నాయి. చరిత్ర రచనా పద్ధతి మనకు తెలియదు. అసలు చరిత్ర అంటే ఏమిటో కూడా మనకు తెలియదు. సామాజిక శాస్త్రం మార్క్స్‌తోనే ఆరంభమైంది. చరిత్ర అంటే ఏమిటి? మానవ సమాజం ఎందుకు మారుతోంది? అనేవి ఆయన అధ్యయన వస్తువులు. ఒక ఉత్పిత్త వ్యవస్థ అంత కంటే అభివృద్ధికరమైన ఉత్పత్తి వ్యవస్థగా మారడమే మార్క్సిస్టు పద్ధతిలో చరిత్ర. దీనికి వర్గపోరాటం ఇరుసు.

ఇక్కడ చరిత్ర అధ్యయనంలో దేశీ భావనను ప్రవేశపెట్టాలి. రాజుల సంస్కృతి ప్రజలది అంటే చెల్లదు చెల్లదు చెల్లదులే.. అని చెరబండరాజు అన్నాడు. ఆయన సంస్కృతి అన్నాడు కాని, ఈ మాట మౌలికంగా చరిత్రకే వర్తిస్తుంది. హిస్టరీ ఫ్రం బిలో, హిస్టరీ ఫ్రం అబౌ.. అనే కీలకమైన విభజనకు సంబంధించింది ఇది. కింది నుంచి నిర్మాణమయ్యే వాస్తవ చరిత్రనే దేశీ అనవచ్చు. ఉత్పత్తి సంబంధాలు మారే క్రమం ఒక్కో సమాజానికి ఒక్కో రీతిలో ఉంటుంది. దీనికి ఆ ఉత్పత్తి వ్యవస్థలో కారణాలు ఉంటాయి. ఇతర సామాజిక సంబంధాలు కూడా కారణమవుతాయి. భారతదేశంలోని సామాజిక సంబంధాల్లో కులమనే అరుదైన ప్రత్యేకత ఉంది. పాత రోజుల్లో అయితే పూర్తిగా కులాల పునాది మీదే పీడిత ప్రజలు ఉత్పత్తిలో పాల్గొనేవారు. కులమనే పటిష్టమైన, అంతరాల వ్యవస్థ వల్ల, దాని భావజాలం వల్ల ఉత్పత్తి శక్తుల ఎదుగుదలకు అవకాశం లేకుండాపోయింది.

మార్క్స్‌ చెప్పిన ఆసియాటిక్‌ మోడ్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌లో ఇది కీలకం. ఉత్పత్తి సంబంధాల్లో గుణాత్మక మార్పు రాకుండా ఇక్కడి సామాజిక ప్రత్యేకతలు అడ్డుకుంటున్నాయి. అయినా ఇక్కడ ఆధిపత్య, పీడిత కులాల రూపంలో, బ్రాహ్మణ-బ్రాహ్మణేతర భావజాల రూపంలో తీవ్రమైన సంఘర్షణ నడిచింది. ఇది ఉత్పత్తి శక్తుల అభివృద్ధికి ప్రేరేపించింది. ఇలా భారతదేశం తనదైన చరిత్ర నిర్మాణక్రమాన్ని కొనసాగించింది. మన దేశీ సామాజిక వాస్తవికత, అందులోని మార్పుల ద్వారా చారిత్రక భౌతికవాదంలోని శాస్త్రీయతను అద్భుతంగా నిరూపించవచ్చు. మానవజాతి చరిత్ర పరిణామాన్ని అర్థం చేసుకోడానికి మార్క్స్‌ అందించిన చారిత్రక భౌతికవాద పద్ధతిలో భారతదేశ చరిత్రను విశ్లేషించవచ్చు.

ఇలాంటి కృషి మార్క్సిస్టు శిబిరంలో ఎప్పుడో మొదలైంది. దాన్ని మరింత ముందుకు తీసికెళ్లాలి. ఇది ఒకసారి మొదలై ముగిసిపోయేది కాదు. పీడిత వర్గాలు తమ చరిత్రను రచించుకోవడం వెనుక భౌతిక, భావజాల సంఘర్షణ ఎంతో ఉంది. బ్రాహ్మణీయ దృష్టితో నిర్మాణమైన చరిత్ర మీద పీడిత కులాల ప్రతివాదన ఎంతో సాగింది. ఇటీవల బాగా చర్చనీయాంశమైన భీమా కొరేగావ్‌ దీనికి మంచి ఉదాహరణ. చరిత్రలోని ఒక ఉదంతాన్ని కింది నుంచి, కింది కులాల ఆచరణ వైపు నుంచి, శ్రామికవర్గ దక్పథం నుంచి పునర్నిర్మించే పని ఇటీవల చాలా ఎక్కువగా సాగుతోంది. మన దేశ సామాజిక వాస్తవికత నుంచి, ఉత్పత్తి సంబంధాల నుంచి చరిత్ర పునర్వాఖ్యానం బలపడుతోంది.

నిజానికి ఇప్పుడు దేశీ చరిత్ర, దేశీ సాహిత్యమని మళ్లీ మాట్లాడం కేవలం అధ్యయన ఆసక్తితోనే కాదు. హిందుత్వం ఫాసిజంగా మారి సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణ్యాన్ని హిందూ జాతి అనే పేరుతో ముందుకు తెచ్చింది. అత్యంత వైవిధ్యభరితమైన మన సామాజిక చైతన్యాలను అది హిందుత్వగా గుదిగుచ్చే సాహసం చేస్తోంది. ఆర్య, ఆధిపత్య చరిత్రను, సంస్కృతిని, పురాణ ఇతిహాసాలను ఎత్తిపడుతోంది. మొత్తంగా ఈ దేశ ప్రజల చరిత్రను రద్దు చేసే కుట్రపన్నుkతోంది.

ఈ తరుణంలో ఈ దేశ ప్రజల నిజ చరిత్రను పటిష్టంగా పునర్నిర్మించాల్సి ఉంది. వేల ఏళ్ల నుంచి రాచరికానికి, బ్రాహ్మణ్య ఆధిపత్యానికి వ్యతిరేకంగా అనేక పాయలుగా విస్తరించిన పీడిత కులాల, వర్గాల చరిత్రను తిరిగి అధ్యయనం చేయాల్సి ఉంది. కరడు కట్టిన భూస్వామ్య ఉత్పత్తి సంబంధాల దోపిడీని ప్రశ్నిస్తూ రైతులు, కూలీలు, ఆదివాసులు చేసిన పోరాటాలను సమగ్రంగా అర్థంచేసుకోవాల్సి ఉంది. మన సంక్లిష్ట వాస్తవికతలోంచి వ్యక్తమైన వర్గపోరాటాల తీరును పూర్తి అర్థంలో స్వీకరించాల్సి ఉంది. ఉత్పత్తి కులాలు, ఆదివాసులు అనేక రూపాల్లో ఆధిపత్య శక్తులపై చేసిన తిరుగుబాటును ఆ స్థల కాల ప్రత్యేకతల్లో, పరిమితుల్లో వర్గపోరాట వ్యక్తీకరణగా గుర్తించాలి.

వీటన్నిటినీ కూడగట్టుకొని విప్లవాత్మకమైన, విముక్తిదాయకమైన మార్పు సాధించడానికి మన దేశీ చరిత్రలోకి, కళా సాహిత్యాలోకి పున:ప్రయాణం చేయాలి. సామాజిక ఆధిపత్యానికి, దోపిడీకి వ్యతిరేకంగా చరిత్రలో సాగిన పోరాటాలకు నాయకత్వం వహించిన నాయకుల, మేధావుల, రచయితల ఆలోచనారీతులను వర్తమాన పోరాటాల స్ఫూర్తితో తిరిగి అధ్యయనం చేయాలి.

అయితే ఈ పని ఎలా చేయాలనేది అతి ముఖ్యమైన ప్రశ్న. మానవ జాతి చరిత్ర అభివృద్ధి క్రమాన్ని వివరించేందుకు చారిత్రక భౌతికవాదమే శాస్త్రీయమైన సిద్ధాంతం. మార్క్సిజం యూరప్‌ సమాజాలను మాత్రమే వివరిస్తుందనే వాళ్లు మన దగ్గర ఉన్నారు. అది విదేశీయమనే సంఘ్‌ ప్రబుద్ధులకు వీళ్లకూ పద్ధతిలో పెద్ద తేడా లేదు. చారిత్రక భౌతికవాదం మానవ జాతి చరిత్రను వివరించే స్థూల సిద్ధాంతం మాత్రమే కాదు. అన్ని సమాజాలను వాటిదైన ప్రత్యేకతల్లోంచి, దేశీయ వికాస క్రమాల్లోంచి వివరించగల సిద్ధాంతం. చరిత్రలో భాగమైన వర్గాన్నే కాదు, మిగతా అన్ని సామాజిక విషయాలను వివరించగల సిద్ధాంతం. మార్క్స్‌ ద్వి శతజయంతి సందర్భంగా మార్క్సిజం లెనినిజం మావోయిజంలోని శాస్త్రీయతను ఈ కోణంలో మార్క్సిస్టులు మళ్లీ మళ్లీ రుజువు చేయాల్సి ఉంటుంది.

(9, 10 ఫిబ్రవరి 2019 తేదీల్లో - నల్గొండలో విప్లవ రచయితల సంఘం సాహిత్య పాఠశాల సంద‌ర్భంగా)


No. of visitors : 543
Type in English and Press Space to Convert in Telugu

Related Posts


దండ‌కార‌ణ్యంలో... న‌క్స‌ల్బ‌రీ 50 వ‌సంతాల వేడుక‌లు

| 17.08.2017 12:00:37pm

న‌క్స‌ల్బ‌రీ వార‌సులైన దండ‌కార‌ణ్య మావోయిస్టు విప్ల‌వ కారులు జ‌న‌త‌న స‌ర్కార్ నేప‌థ్యంలో త‌మ‌కు తామే కాదు..దేశ వ్యాప్తంగా మైదాన ప్రాంత ప్ర‌జ‌ల‌కూ, ప్ర‌పంచ.....
...ఇంకా చదవండి

విరసం సాహిత్య పాఠశాల

విరసం | 18.01.2017 11:20:58am

రాజకీయ, సిద్ధాంత రంగాల్లోనేకాదు, సాహిత్య కళారంగాల్లో కూడా తలెత్తుతున్న సంక్షోభాలన్నిటికీ సోషలిజమే పరిష్కారమని చెప్పవలసి ఉన్నది. ఈ స్ఫూర్తితో విరసం ఈ సాహిత్య...
...ఇంకా చదవండి

నోట్ల ర‌ద్దు ప్ర‌గ‌తి వ్య‌తిరేక‌మైన‌ది : ప్ర‌సాద్‌

ప్ర‌సాద్ | 03.03.2017 10:35:48am

విర‌సం సాహిత్య పాఠ‌శాల (11, 12 ఫిబ్ర‌వ‌రి 2017, ప్రొద్దుటూరు) లో పెద్ద నోట్ల ర‌ద్దుపై ఐఎఫ్‌టీయూ ప్ర‌సాద్ ప్ర‌సంగం...
...ఇంకా చదవండి

సాయిబాబా అనారోగ్యం - బెయిల్‌ ప్రయత్నాలు - వాస్తవాలూ - వక్రీకరణలూ

విరసం | 09.11.2017 10:58:17pm

కేవలం ఆరోగ్యం దృష్ట్యా సాయిబాబాకు బెయిల్‌ పిటీషన్‌ వేయడంలో చాల రిస్క్‌ ఉంది. ఆయన కూడ మొదటి నుంచి ఆ గ్రౌండ్స్‌ మీదనే వేయొద్దని అంటున్నాడు. లీగల్‌గా, పొలిటికల...
...ఇంకా చదవండి

సోషలిజమే ప్రత్యామ్నాయమని ఎలుగెత్తి చాటుదాం

విరసం | 24.10.2016 02:26:21pm

మానవజాతి చరిత్రలో మహాద్భుత ఘట్టం బోల్షివిక్‌ విప్లవం. ఈ నవంబర్‌ 7 నుంచి రష్యన్‌ విప్లవ శత వసంతోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. చరిత్ర గతిని మార్చేసిన అనేక తిరుగ...
...ఇంకా చదవండి

ఈ పుస్తకాన్ని చదివే సాహసం చేయండి

ఫ్రాంజ్ ఫనాన్ | 18.12.2016 10:36:24am

ఇరవయ్యవ శతాబ్దంలో వలసవాదం గురించి, జాత్యహంకారం గురించిన అత్యద్భుతమైన సిద్ధాంతకర్త ఫ్రాంజ్ ఫనాన్. ...
...ఇంకా చదవండి

నక్సల్బరీ విశిష్టత- రాజకీయ కార్యక్రమం

పాణి | 20.05.2017 09:57:29pm

నక్సల్బరీ ఒక పంథా అని అంటున్నామంటే పార్లమెంటరీ విధానాన్ని పూర్తిగా తిరస్కరించిన సాయుధ పోరాట మార్గమని అర్థం. విప్లవం గురించి ఎన్ని రకాలుగా ఆలోచించేవారైనా.......
...ఇంకా చదవండి

లాల్ ముసాఫిర్ - కామ్రేడ్ ఎం.టి. ఖాన్‌

virasam | 07.06.2016 11:00:13am

పాత‌న‌గ‌రం పేద ముస్లింల‌కు బ‌డేబాయి, స‌హ‌చ‌రుల‌కు ఖాన్‌సాబ్‌.పౌర‌హక్కుల నేత‌గా, విప్ల‌వ ర‌చ‌యిత‌గా, అధ్యాప‌కుడిగా, పాత్రికేయుడిగా తెలుగు స‌మాజంలో త‌నదైన‌......
...ఇంకా చదవండి

కంచె ఐలయ్య పై రాజ్యం, సంఘపరివార్‌, ఆధిపత్య కులాలు చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

విప్లవ రచయితల సంఘం | 25.09.2017 02:25:15pm

భౌతికదాడులు చేయడం, దాడులు చేస్తున్న వాళ్లకు రాజ్యమే దన్నుగా నిలబడి రచయిత మీద కేసు నమోదు చేయడం ఫాసిజమే తప్ప ప్రజాస్వామ్యం కాదు. వేల ఏళ్లుగా శ్రమ దోపిడికి, స ...
...ఇంకా చదవండి

బెజ్జంకి అమరుల స్ఫూర్తితో సాహిత్య, మేధో రంగాల్లో బోల్షివిజాన్ని ఎత్తిప‌డ‌దాం

విరసం | 06.11.2016 12:56:33am

చారిత్రక భౌతికవాదాన్ని, వర్గపోరాటాన్ని, సోషలిజాన్ని ప్రజా శ్రేణుల్లోకి మరోసారి తీసికెళ్లడానికి యాభై ఏళ్ల సాంస్కృతిక విప్లవం, నూరేళ్ల బోల్షివిక్‌ విప్లవం.....
...ఇంకా చదవండి


ఎడిట‌ర్ - క్రాంతి
టీం - అర‌స‌విల్లి కృష్ణ‌, సాగ‌ర్‌, పావ‌ని

  కార్య‌క్ర‌మాలు  

  అరుణ‌తార  

  సోష‌లిజ‌మే ప్ర‌త్యామ్నాయం  

నూతన ప్రజాస్వామిక విప్లవ నేత

కామ్రేడ్ మావో "సాంస్కృతిక విప్లవంʹ అనే ఒక నూతన రూపాన్ని అభివృద్ధి చేశాడు. పార్టీలో, అధికారంలో ఉండి పెట్టుబడిదారీ మార్గాన్ని చేపట్టిన వారిని ప్రధాన లక్ష..

 • ఫ్రెడరిక్ ఏంగెల్స్ జీవిత చరిత్ర
 • విప్లవ పోరాట పంథాలో కార్మికవర్గ సమైక్యత నేడు ప్రధాన కర్తవ్యం
 • Open letter to Krishna Bandyopadhyay
 • Naxalbari Politics: A Feminist Narrative
    వీడియోలు  
  లేటెస్ట్ పోస్టులు...
  అరుణతార ఫిబ్రవరి - 2020
  తెర ముందు కథ!
  షాహిన్ భాగ్..షాహిన్ భాగ్
  హిబా కోసం
  నాడు రెండుకళ్ళ-నేడు మూడు కాళ్ళ ముచ్చట్లు
  సత్యాన్ని చెప్పడమే రాజకీయ కవితా లక్షణం
  షాహీన్ బాగ్... ఒక స్వేచ్ఛా నినాదం
  విప్లవం నేరం కాదు. విప్లవకారుడు నేరస్తుడూ కాదు.
  అరెస్టు - అన్‌టచబులిటీ
  విప్లవ కవిత్వంలో ఈ తరం ప్రతినిధి
  నిర్బంధ ప్రయోగశాల
  అరుణతార జనవరి - 2020

  గత సంచికలు...


  Email Subscription

  Related Links

  www.sanhati.com
  www.bannedthought.net/India
  www.indiaresists.com
  www.signalfire.org
  www.icspwindia.wordpress.com
  www.kractivist.org
  www.magazine.saarangabooks.com
  www.arugu.in
  www.sovietbooksintelugu.blogspot.in
 •